
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే సక్సెస్ అయ్యారు. ఐతే మిగతా పెద్ద సినిమాలు వేరు “పెద్ది” (Peddi) సినిమా వేరు అని అంటున్నారు జగపతి బాబు. ఈ సిఎంమాలో ఆయన అప్పలసూరి అనే పాత్ర పోషించారు. తమ గూడెంలో రైలు ఆగాలని అతని జీవితం అంతా పోరాటం చేస్తాడు. ఆ పాత్రకి రావాల్సినంత గుర్తింపు దక్కలేదు అని ఆయన బాధ పడుతున్నారు.
‘‘పెద్ది విడుదలైన తర్వాత ఓ ప్రముఖ దర్శకుడు నాకు ఫోన్ చేశారు. ‘పెద్ది’లో మీరు అద్భుతమైన పాత్ర పోషించారు. కానీ మీ నటన గురించి ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. ఇదే పాత్రను మరో భాషకు చెందిన నటుడు చేసి ఉంటే భారీగా హైలైట్ చేసేవారు. వరుసగా 20 సినిమాల ఆఫర్లు కూడా వచ్చేవి. కానీ మీ విషయంలో అలాంటిదేమీ జరగడం లేదు అని ఆయన అన్నారు. ఆయన మాట నిజమే అనిపించింది,” అని జగపతి బాబు అన్నారు.
“పెద్ది విడుదలైన తర్వాత నేను కూడా దర్శకుడు బుచ్చి బాబును ఒకటే ప్రశ్న అడిగాను. షూటింగ్ సమయంలో నా ప్రతి షాట్‌కు క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మాత్రం నా పాత్ర గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నన్ను మర్చిపోయారా? అని అడిగాను”
“పెద్ది’ కోసం నేను ప్రాణం పెట్టి పనిచేశాను. అందుకే గుర్తింపు కోరే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాల విషయంలో నేను ఎప్పుడూ ఇలా అడగలేదు. ‘పెద్ది’కి ఇంకా రావాల్సిన ఆదరణ రావాలి. కచ్చితంగా ఆ గుర్తింపు, ఆదరణ రెండూ వస్తాయి,” అని జగపతి బాబు అన్నారు.
