
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ యూనిఫార్మ్ డిజైన్ చేశారు. అది కొంచెం ఆడవాళ్ళ శరీరాన్ని sexualisation చేస్తున్నట్లు ఉందని ఆమె పేర్కొంది.
“భారత్ భాగ్య విధాత” అనే కొత్త చిత్రంలో స్టాఫ్ నర్సు పాత్ర పోషిస్తోంది కంగన.
నర్సుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని ‘భారతీయీకరించాలని’ ఆమె వాదించారు. ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె మాటలను ప్రశంసించగా, మరికొందరు ఇది ఆచరణ సాధ్యం కాదని, ప్రభుత్వ అసమర్ధ పాలన, సమస్యల నుండి దృష్టి మరల్చే కామెంట్లు అని విమర్శించారు.
కంగన రనౌత్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ. అయినా సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన సినిమాలేవీ గత 5,6 ఏళ్ళలో ఆడలేదు. అయినా ఆమె పట్టు వదలకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నర్స్ పాత్ర పోషిస్తూ నర్సుల యూనిఫామ్ లు మార్చాలని చెప్తున్నారు.
