Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!

TeluguCinema, June 5, 2026June 5, 2026
Nidhhi Agerwal

అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు. 2 భారీ చిత్రాలు చేసింది, ఆ రెండు సినిమాలతో ఓ వెలుగు వెలుగుదాం అనుకుంది. కానీ దురదృష్టవశాత్తూ రెండూ ఫ్లాప్ అయ్యాయి.

దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. ‘ఐరెన్ లెగ్’ అంటూ చాలామంది ఆమెను ఆడిపోసుకున్నారు. అలా చాలా ట్రోలింగ్ భరించిన నిధి అగర్వాల్ ఎట్టకేలకు తనపై నడిచిన తిట్ల దండకంపై స్పందించింది.

“నేను ఎప్పుడూ పొగడ్తల్ని తలకెక్కించుకోలేదు, అదే విధంగా ట్రోలింగ్స్ ను కూడా పట్టించుకోలేదు.” అనేది నిధి అగర్వాల్ సమాధానం. ఓ సినిమా ఫ్లాప్ ను ఒకరికే ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించిన నిధి, తను అదృష్టం కంటే కష్టాన్నే నమ్ముకున్నానని తెలిపింది.

‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం దాదాపు మూడేళ్లు కేటాయించింది నిధి. ఆ తర్వాత ‘రాజాసాబ్’ కోసం మరింత సమయం కేటాయించింది. రెండు ప్రతిష్టాత్మక చిత్రాలే కానీ రెండూ పరాజయం పాలయ్యాయి. సినిమా ఏదైనా తను వంద శాతం కష్టపడతానని, ఫలితం తన చేతిలో ఉండదని అంటోంది నిధి.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!

Recent News

  • Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!
  • Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Priyanka Mohan: ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో!
  • Sai Tej: ఇంకెక్కడ నాకు పెళ్లి అవుతుంది?
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes