Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha

TeluguCinema, June 15, 2026June 15, 2026
Samantha

39 ఏళ్లకే చాలా జీవితాన్ని చూశానంటోంది సమంత (Samantha). తను అనుభవించిన కష్టాలు, నష్టాలన్నీ ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటివని, అవన్నీ కలిపి చూసుకుంటే, ఎంతో నేర్చుకున్నాననే ఫీలింగ్ వచ్చిందంటోంది.

“చాలామందికి వాళ్లు అనుభవించిన స్ట్రగుల్ బయటకు కనిపించకపోవచ్చు. కానీ నా లైఫ్, నా కష్టాలు, నా జీవితం ఓ తెరిచిన పుస్తకం. నా గురించి, నా బాధల గురించి ప్రజలందరికీ తెలుసు. చాలామంది నా జీవితాన్ని జడ్జ్ చేశారు, రివ్యూ చేశారు, పోస్టుమార్టం కూడా చేశారు. అదంతా తీసుకోవడం చాలా కష్టమైంది. అదే టైమ్ లో వాటన్నింటి వల్ల నేను జీవితాన్ని చూశాను. జీవితంలో ఎంతో అనుభవించి, ఇంకెంతో నేర్చుకున్నాను.”

తన కెరీర్ కు ఈ జీవితానుభవాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెబుతోంది సమంత. ఓ సీన్ లో నటించేటప్పుడు, తన వ్యక్తిగత అనుభవాలు బాగా హెల్ప్ అవుతున్నాయని, జీవితంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నానని అంటోంది.

“ఒకప్పుడు పేపర్ చూసి నటించేదాన్ని. కానీ ఇప్పుడు ఓ సీన్ లో నటించేటప్పుడు నా జీవితంలో పొందిన అనుభూతుల నుంచి నటించగలుగుతున్నాను. నటన నా మనసులోంచి వస్తోందిప్పుడు. ఏదైనా విషయాన్ని ఎక్కువగా అనుభూతి చెందుతున్నాను. అలా నా జీవితానుభవాల్ని నా కెరీర్ కోసం ఉపయోగిస్తున్నాను. కేవలం నటన మాత్రమే కాదు, లైఫ్ లో నేను తీసుకునే నిర్ణయాలకు నా జీవితానుభవాలు ఉపయోగపడుతున్నాయి.”

లాంగ్ గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది సమంత. ఆమె భర్త రాజ్ నిడిమోరు క్రియేషన్ లో, నందనీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!

Recent News

  • Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!
  • Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Priyanka Mohan: ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో!
  • Sai Tej: ఇంకెక్కడ నాకు పెళ్లి అవుతుంది?
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes