తెలుగు హీరోయిన్లలో చాలా బిజీగా ఉన్న భామ… మీనాక్షి చౌదరి. ఆమె నటించిన మూడు చిత్రాలు కేవలం 23 రోజుల గ్యాప్ లో వస్తున్నాయి. అందులో మొదటి చిత్రం ఇప్పటికే విడుదలైంది. అదే “లక్కీ భాస్కర్”. ఈ సినిమాలో ఆమె దుల్కర్ కి భార్యగా నటించింది. దీపావళి కానుకగా విడుదలైన “లక్కీ భాస్కర్” కోసం ఇప్పటికే చాలా ప్రొమోషన్ వీడియోలు చేసింది.
ఇక ఆ సినిమా నుంచి మరో సినిమా ప్రచారానికి మళ్లింది. ఆమె తదుపరి విడుదల.. మట్కా. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ మూవీ ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. అందుకే ఇక ఇప్పుడు ఆమె ఫోకస్ ‘మట్కా’ ప్రమోషన్.
ALSO READ: MATKA trailer is out
ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ కి భార్యగా నటించింది. ‘లక్కీ భాస్కర్’లో కూడా అంతే. రెండూ పీరియడ్ చిత్రాలే. అంటే ఆమె పాత్రల్లో పెద్దగా మార్పు లేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ తో పది రోజులు ప్రమోషన్ చేసి ఆ తర్వాత విశ్వక్ సేన్ తో కలిసి ప్రచార మొదలుపెడుతుంది.
విశ్వక్ సేన్ నటించిన “మెకానిక్ రాకీ’లో ఆమె ఒక హీరోయిన్. అది నవంబర్ 22న విడుదల కానుంది. దాంతో, ఆ ప్రమోషన్ కూడా చెయ్యాలి.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…