కొన్ని సినిమాలపై సామాన్య జనంతో పాటు, స్టార్స్ కూడా స్పందిస్తుంటారు. కాకపోతే వాళ్ల ట్వీట్స్ అన్నీ రొటీన్ గా ఉంటాయి. సినిమా బాగుంది, శుభాభినందనలు అనే టైపులోనే ఉంటాయి. కానీ ఓ ఆన్ లైన్ రివ్యూవర్ స్థాయిలో ఓ స్టార్ హీరో సమీక్ష రాస్తే ఎలా ఉంటుంది? ఇది అలాంటి సందర్భమే.
మత్తు వదలరా 2 సినిమా థియేటర్లలోకి వచ్చింది. సత్య కామెడీతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడీ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చారు. ఇవ్వడం కాదు, ఏకంగా ఆయన రివ్యూ రాసుకొచ్చారు.
“నిన్ననే మత్తు వదలరా – 2 చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోదపరిచింది. హ్యాట్సాఫ్ రితేష్. శ్రీసింహా, సత్య, ఫరియా, కాలభైరవకు నా అభినందనలు”
ఇలా సినిమా గురించి విపులంగా చర్చిస్తూ రివ్యూ ఇచ్చారు మెగాస్టార్. దీంతో యూనిట్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. సత్య ఆనందానికైతే అవధుల్లేవు. మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమాకు వసూళ్లు, ఆక్యుపెన్సీ పెరిగాయి. 2 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 11 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…