Categories: న్యూస్

ఇళయరాజా పాట, కీరవాణి మాట

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడే కాదు గాయకుడు కూడా. పాటలు కూడా రాశారు. దాదాపు 60 వరకు పాటలు రాశారట. తాజాగా ఆయన ‘షష్టిపూర్తి’ అనే సినిమా కోసం లిరిక్ రైటర్ గా మారారు.

రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తుండడం విశేషం. ఇళయరాజా స్వరపరిచిన ఒక పాటకు కీరవాణి పల్లవి, చరణాలు రాయడం మరో విశేషం.

”మా సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. చైతన్య ప్రసాద్ గారు కొన్ని పాటలకు సాహిత్యం అందించారు. ఆయన ద్వారా కీరవాణి గారిని అప్రోచ్ అయ్యాము. సిట్యువేషన్ చెప్పి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేయగా, ఓకే అన్నారు. మేం స్టూడియో‌కు తిరిగి వచ్చేసరికి పల్లవి రాసి పంపించారు. ఆ రోజే చరణం, తర్వాత రోజు మరో చరణం రాసి ఇచ్చారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది,” అని దర్శకుడు పవన్ ప్రభ. అన్నారు.

కీరవాణి, ఇళయరాజా కాంబినేషన్ ఇలా సెట్ అయింది.

Admin

Recent Posts

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…

12 hours ago

Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!

పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…

12 hours ago

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

1 day ago

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

1 day ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

2 days ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

2 days ago