డార్లింగ్ అనగానే గుర్తొచ్చే పేరు ప్రభాస్. తన సన్నిహితులందర్నీ డార్లింగ్ అంటూ ముద్దుగా పిలవడం ప్రభాస్ కు అలవాటు. అటు ప్రభాస్ ను కూడా చాలామంది ప్రేమగా డార్లింగ్ అంటూ పిలుచుకుంటారు. అయితే ఇంతమందికి డార్లింగ్ అయిన ప్రభాస్ ఆ ఇద్దరికి మాత్రం డార్లింగ్ కాదు. వాళ్లే మోహన్ బాబు, రానా.
అందర్నీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్.. మోహన్ బాబును మాత్రం బావ అని పిలుస్తాడు. ఎఁదుకో బుజ్జిగాడు సినిమా నుంచి వీళ్లిద్దరి మధ్య ఆ పిలుపు అలా సెట్ అయిపోయింది. మోహన్ బాబును బావ అనడం, తిరిగి మోహన్ బాబు కూడా ప్రభాస్ ను బావ అని సంభోదించడం కామన్ అయిపోయింది. “బాహుబలి 2” సూపర్ హిట్ అయిన సందర్భంగా మరోసారి ఈ “బావ” అనే పిలుపు తెరపైకి వచ్చింది. బాహుబలి-2 సినిమాలో బ్రహ్మాండంగా నటించావంటూ ప్రభాస్ ను మెచ్చుకుంటూనే “ఈ ఏడాది పెళ్లి చేసుకో బావా” అంటూ ముద్దుగా ట్వీట్ చేశారు మోహన్ బాబు.
అటు రానా-ప్రభాస్ కూడా ఒకర్నొకరు బావ అని ముద్దుగా పిలుచుకుంటారు. రీసెంట్ గా జీ తెలుగులో ప్రసారమైన “కొంచెం టచ్ లో ఉంటే చెబుతా” కార్యక్రమంలో ఓ ప్రాంక్ కాల్ చేయమంటే.. ప్రభాస్ కే కాల్ చేశాడు రానా. ఆ కాల్ లో బావ అంటూ ప్రభాస్ ను సంభోదించాడు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…