నాగచైతన్య కొత్త సినిమా “రారండోయ్ వేడుక చూద్దాం” త్వరలోనే పాటలతో సందడి చేయబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బడా హీరోలంతా ఫాలో అవుతున్న ట్రెండ్ నే చైతూ కూడా ఫాలో అవుతున్నాడు. తన కొత్త సినిమా రారండోయ్ వేడుక చూద్దాం పాటల్ని ఆన్ లైన్లో విడుదల చేయబోతున్నాడు. ఇందులో భాగంగా మొదటి సింగిల్ శనివారం రిలీజ్ అవుతుందని ప్రకటించాడు చైతూ.
నిన్నే పెళ్లాడతా, మన్మధుడు సినిమాలకు దగ్గరగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను తెరకెక్కించారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించాడు కూడా. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఈనెల 26న విడుదల అవుతుంది. కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…