ఏ సినిమాకైనా 45-50 కోట్లు ఎందుకు పెడతారు..? ధర్మ వడ్డీ లెక్కన చూసుకున్నా ఖర్చులు పోనూ కనీసం కోటి రూపాయలైనా మిగులుతుందని ఆశ. “మిస్టర్ బచ్చన్” విషయంలో నిర్మాతకు ఆ ఆశ లేకుండా పోయింది. డబుల్ డిజిట్ లో బడ్జెట్ పెడితే, సింగిల్ డిజిట్ లో కలెక్షన్లు వచ్చాయి.
రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది “మిస్టర్ బచ్చన్” సినిమా. అంతకుముందు రవితేజతో “ధమాకా” రూపంలో డబ్బులు సంపాదించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఈసారి అదే నమ్మకంతో పెట్టుబడి పెట్టారు.
కట్ చేస్తే, సినిమా ఎపిక్ డిజాస్టర్ గా మారింది.
ఈ సినిమాకు కేవలం 10 కోట్ల రూపాయల షేర్ (ప్రపంచవ్యాప్తంగా) మాత్రమే వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య కాలంలో రవితేజ నటించిన ఏ సినిమాకూ ఇంత తక్కువ షేర్ రాలేదు.
సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ముందురోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ వేశారు. అదే పెద్ద దెబ్బ కొట్టింది. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో, మొదటి రోజుకే సినిమా డ్రాప్ అయింది. రెండో రోజుకు క్రాష్ అయింది. వారం తిరక్కముందే డిజాస్టర్ అనిపించుకుంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…