ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశామా లేదా అనేది ముఖ్యమంటూ కొన్ని రోజుల కిందట మృణాల్ (Mrunal Thakur) స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా స్టేట్ మెంట్ కు తగ్గట్టే ఆమె అడుగులు పడుతున్నాయి. విలక్షణ పాత్రల వైపు మొగ్గుచూపుతోంది ఈ బెంగాలీ బ్యూటీ.
‘డెకాయిట్’ చిత్రంలో హీరోతో సమానమైన పాత్ర పోషించిన మృణాల్… ఇప్పుడు అలాంటిదే మరో అరుదైన పాత్రకు అడుగు దూరంలో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమాలో మృణాల్ నటించే అవకాశం ఉందంటున్నారు సినీ జనం.
‘బలగం’ వేణు దర్శకత్వంలో వస్తోంది ‘ఎల్లమ్మ’ సినిమా. ముందుగా ఇందులో నితిన్ ను హీరోగా అనుకున్నారు. హీరోయిన్ గా సాయిపల్లవిని అనుకున్నారు. కొన్ని రోజులకు హీరో మారిపోయాడు. నితిన్ స్థానంలో దేవిశ్రీప్రసాద్ వచ్చాడు. ఇప్పుడు హీరోయిన్ మార్పు కూడా అనివార్యమైంది.
ఈ ప్రాజెక్టు నుంచి సాయిపల్లవి తప్పుకోవడంతో, ఆ పాత్ర కోసం మృణాల్ ను సంప్రదించారు మేకర్స్. కథ విన్న మృణాల్, ఇంకా తన అభిప్రాయాన్ని చెప్పలేదు. రేపోమాపో ‘ఎల్లమ్మ’ నుంచి కీలక ప్రకటన వచ్చేలా ఉంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఆల్రెడీ సినిమా సెట్స్ పై ఉంది.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…
'పెద్ది'లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రను గ్లామర్ పరంగా అతిగా చూపించడంపై వచ్చిన విమర్శలపై దర్శకుడు బుచ్చి బాబు…
హీరోయిన్లు ఈమధ్య సబ్ స్క్రిప్షన్ల మీద పడ్డారు. తమ ఇనస్టాగ్రామ్ ఎకౌంట్లకు చందాలు పెడుతున్నారు. మౌనీ రాయ్, సన్నీ లియోన్,…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పుకారు వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది కూడా అలాంటిదే. అల్లు అర్జున్ (Allu…