సమంత (Samantha Ruth Prabhu) తాజా స్టేట్ మెంట్ ఇది. తనకు సినిమాల్లో హీరో అక్కర్లేదని అంటోంది ఈ ముద్దుగుమ్మ. దీనికి ఆమె చెప్పే లాజిక్ కూడా సహేతుకంగా ఉంది.
“నేను ఎంచుకున్న సినిమాల్లో కథే హీరో. నా దృష్టిలో మొదటి స్థానం కథకే. ఆ తర్వాతే నటీనటులు. కాబట్టి నా సినిమాల్లో కథ హీరో. నేను హీరోయిన్.”
ఇలా తన వెర్షన్ వినిపించింది సమంత. అయితే అంతర్లీనంగా చూసుకుంటే, స్టార్ హీరోల సినిమాల్లో తను నటించనని, హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తానని ఆమె చెప్పకనే చెప్పింది.
ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విశేషాలు వెల్లడించింది సమంత. ప్రస్తుతం ఈమె 25 వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తోందట. తన రోజువారీ కార్యక్రమాలు, బిజినెస్ పనులు అన్నీ వాట్సాప్ లోనే చూసుకొని, అందరి కంటే ముందే రెస్పాండ్ అవుతానని చెబుతోంది.
ఇలా బిజీ లేకుండా గడిపే సమంత, ప్రతి 3 నెలలకు ఒక్కసారి కచ్చితంగా బ్రేక్ తీసుకుంటానంటోంది. ఇషా ఫౌండేషన్ కు వెళ్లి వారం రోజులు ఏకాంతంగా గడుపుతుందంట. ఈ వారం రోజులు ఆమె ఫోన్ అస్సలు చూడదంట. జనంతో కూడా చాలా తక్కువ మాట్లాడుతుందంట.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…
తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…