ఇప్పటికే ఓ కోర్టు కేసు వేశారు నాగార్జున. తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచితంగా, అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఇప్పుడీ నటుడు మరో కేసు వేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి అన్వేష్ వంతు.
“ప్రపంచ యాత్రికుడు అన్వేష్” గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలోని ప్రముఖ యూట్యూబర్లలో ఒకడు. ఏదో ఒక దేశం తిరగడం, ఆ దేశ విశేషాల్ని తనదైన యాసలో చెప్పి రక్తి కట్టించడం ఇతగాడికి అలవాటు. అలా ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించాడు.
ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కలకలం రేగిందో, అప్పుడిక అన్నీ పక్కనపెట్టేశాడు అన్వేష్. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించిన వాళ్లను టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక దశలో వ్యక్తిగత అంశాలు, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాడు.
ఈ క్రమంలో బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జునపై కూడా నోరు పారేసుకున్నాడు. చివరికి ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులపై కూడా కామెంట్స్ చేశాడు. దీంతో అన్వేష్ పై కేసు పడింది.
ఇప్పుడీ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నాగార్జున రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్ పై స్ట్రాంగ్ గా కేసు ఫైల్ చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నారట.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…