నార్నె నితిన్ హీరోగా “మ్యాడ్” అనే చిత్రంలో నటించాడు. అది హిట్ అయింది. ఇప్పుడు “ఆయ్” అనే సినిమాలో నటించాడు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ‘ఆయ్’ సినిమా విశేషాలను నితిన్ మీడియాతో పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ భార్య సోదరుడు నితిన్.
– అల్లు అరవింద్‌గారిసలహాతో ఈ టైటిల్ పెట్టాం. గోదావరి స్లాంగ్‌లో “ఆయ్” అనే పదాన్ని కామన్‌గా వాడుతుంటాం. సో కథకు కరెక్ట్, కథ జరిగే ప్రాంతానికి సూట్ అయ్యే టైటిల్. అందుకే ‘ఆయ్’ అని ఫిక్స్ చేశాం.
– సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. కాబట్టి పోస్టర్స్‌లో అంతా ఫన్ బాత్ అనే పెట్టారు. కులం, మతం కంటే స్నేహం చాలా గొప్పది. అంత కంటే గొప్ప విషయమేదీ ఉండదనే మెసేజ్‌ను ‘ఆయ్’ సినిమాలో ఇస్తున్నాం.
చిన్నప్పటి నుంచి నాకున్న గోదావరి ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, వాళ్లు మాట్లాడేటప్పుడు వినటం చేశాను. కాబట్టి ‘ఆయ్’ మూవీలో స్లాంగ్ మాట్లాడేటప్పడు నాకేమీ ఇబ్బందిగా అనిపించలేదు.
– మ్యాడ్ మూవీ కథకు తగ్గట్టు బిహేవ్ చేశాను. ‘ఆయ్’ సినిమా కథకు తగ్గట్టు యాక్ట్ చేశాను. ఈ మూవీ కోసం స్పెషల్ గా కష్టపడలేదు. హీరోయిన్ నయన్ సారిక మరాఠీ అమ్మాయి. కానీ తెలుగు అమ్మాయిలా ఉంటుంది.
– ఎన్టీఆర్‌గారు ట్రైలర్ చూశారు. ఆయనకు కామెడీ బాగా నచ్చింది. ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ వస్తే బావుంటుందనిపిస్తుంది.
– కథ నచ్చితేనే సినిమాలు చేస్తున్నాను. మ్యాడ్ అయినా, ‘ఆయ్’ మూవీ అయినా కథ నచ్చే నటించాను.
– మ్యాడ్ సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉండొచ్చు.
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…