“హరిహర వీరమల్లు” సినిమా ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ సినిమా సరిగ్గా 50 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. ఈ సారి మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ లేదు. మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. ఇది రెండు భాగాలుగా తీస్తున్నామని నిర్మాత ఏ.ఎం. రత్నం చెప్తున్నారు. రెండో భాగం తర్వాత సంగతి… మొదటి భాగం మొత్తానికి విడుదల కానుండడంతో హీరోయిన్ నిధి అగర్వాల్ ఊపిరి పీల్చుకుంటోంది.
ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి, తాను కలకంటున్నట్లు పెద్ద హిట్ అయితే తన కెరీర్ మారిపోతుందని భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమా కోసం ఈ భామ చాలా కష్టపడింది మరి. ఆమె ఈ సినిమా సెట్లో 2001లో చేరింది. అప్పటి నుంచి ఈ సినిమాకే అంకితం అయింది.
మధ్యలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న “రాజాసాబ్” షూటింగ్ చేసింది కానీ “వీరమల్లు”కి ఏకంగా నాలుగేళ్లు డేట్స్ ఇచ్చింది మార్కి.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “హరిహర వీరమల్లు”లో సినిమాలో నిధి పంచమి అనే పాత్రలో ఆమె కనిపిస్తుంది.
50 రోజుల్లో ఈ అమ్మడి ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుంది. ఇక ఆమె నటిస్తున్న మరో పెద్ద చిత్రం “ది రాజాసాబ్” ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుంది.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…