కుప్పం నుంచి వచ్చేవాళ్లు సాధారణంగా చంద్రబాబు ఫ్యాన్స్ ఉంటారు లేదా నారా లోకేష్ అభిమానులైనా అయి ఉంటారు. కానీ కుప్పం నుంచి ముగ్గురొచ్చారు. వాళ్లు ఎన్టీఆర్ అభిమానులు.
అభిమాన హీరోని కలిసేందుకు ఫ్యాన్స్ చేసే సాహసాలు చాలానే చూశాం. ఇది కూడా అలాంటి సాహసమే. కుప్పం నుంచి ఈ ముగ్గురు నడుచుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్షరాలా 620 కిలోమీటర్లు నడిచారు.
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ వీళ్లు తమ పాదయాత్ర ప్రారంభించారు. చేతిలో పెద్ద ఫొటో పట్టుకొని వందల కిలోమీటర్లు అలా నడుస్తూనే ఉన్నారు. విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది.
వెంటనే తన ఇంటికి పిలిపించుకున్నాడు తారక్. తన వీరాభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్లకు తనతో ఫొటోలు దిగే అవకాశం కల్పించాడు. అంత దూరం నడవకూడదంటూ వాళ్లను సున్నితంగా హెచ్చరించాడు కూడా. ఆ తర్వాత వాళ్లిచ్చిన ఫొటోను అందుకున్నాడు.
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…