Categories: న్యూస్

#RC16: రామ్ చరణ్ లుక్ ఇదే

మేకోవర్ లో ఉన్నప్పుడు హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ లుక్ బయటకు రాకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా ఇన్నాళ్లూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు చరణ్ నయా లుక్ బయటపడింది.

బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అవుతున్న విషయాన్ని చరణ్ ఇదివరకే బయటపెట్టాడు. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్న చరణ్, ఆ మూవీ కోసం సరికొత్త లుక్ లోకి మారేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈమధ్య రోల్స్ రాయిస్ కారు కొన్నాడు చరణ్. ఆ కారు రిజిస్ట్రేషన్ పని మీద అతడు హైదరాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాడు. సరిగ్గా అక్కడ చరణ్ నయా లుక్ బయటపడింది. స్టయిలిష్ గా కనిపిస్తూనే, కాస్త రఫ్ గా ఉన్నాడు చరణ్.

నిజానికి ఇది ఫైనల్ లుక్ కాదు. ఇంకా చాలా మేకోవర్ అవ్వాల్సి ఉంది. కాబట్టి అప్పుడే చరణ్ లుక్ పై ఓ అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. మొదటి షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు. 

Admin

Recent Posts

Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…

8 hours ago

Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!

తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…

8 hours ago

తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni

అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్‌ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…

23 hours ago

Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?

రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…

24 hours ago

Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…

1 day ago

Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం

దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…

1 day ago