రానాకి హీరోగా కన్నా విలన్ గానే ఎక్కువ సక్సెస్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయింది “బాహుబలి” వంటి సినిమాల్లో విలన్ గా నటించడం వల్లే. ఇటీవల “భీమ్లా నాయక్”లో కూడా ప్రతినాయకుడి పాత్రలోనే కనిపించారు రానా.
ఆ మధ్య ఆరోగ్యం దెబ్బ తినడం వల్ల సినిమాల సంఖ్య తగ్గించిన రానా మళ్ళీ విలన్ పాత్రలతో బిజీ అవుతున్నారు. తాజాగా రజినీకాంత్ సినిమాలో కూడా విలన్ గానే నటిస్తున్నారట.
రానా ఇప్పటికే హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో రజినీకాంత్ తో కలిసి కొన్ని కీలకమైన సీన్లు పూర్తి చేశారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. రానాకి విలన్ పాత్రలకు కూడా మంచి పారితోషికం దక్కుతోంది. సినిమాకి 5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
ఇక హీరోగా రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు పూర్తి చేసుకుంటాయో చూడాలి.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…