న్యూస్

Ritika Nayak: హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే ‘మిరాయి’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా హీరో నితిన్ సరసన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఊహించని విధంగా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతేడాది వచ్చిన ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో నితిన్ ఎలాగైనా పక్కా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సినిమాకు ఓకే చెప్పాడు.

నారి సిరిసవాడ, సోమశేఖర్ అనే ఇద్దరు యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. లాంఛింగ్ కు కూడా రితికా వచ్చింది. ఇప్పుడు ఆమెను తప్పించి, ఆ స్థానంలో వైష్ణవి చైతన్యను తీసుకున్నట్టు తెలుస్తోంది.

హిట్ హీరోయిన్ కోసం ఎవరైనా తహతహలాడతారు. సెంటిమెంట్ గా ఉంటుందని, క్రేజ్ కలిసొస్తుందని భావిస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి రితికానుత ప్పించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె స్వచ్ఛందంగా తప్పుకుందా, లేక తప్పించారా అనేది తేలాల్సి ఉంటుంది. అంతకంటే ముందు, ఈ వార్తపై యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

TeluguCinema

Recent Posts

ఒకే వారంలో 2 బ్లాక్ బస్టర్లు: Blast and Avatar 3

సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…

1 hour ago

Samantha తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి

సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…

5 hours ago

Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…

17 hours ago

Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!

"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…

23 hours ago

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…

23 hours ago

Priyanka Mohan: ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో!

గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే…

1 day ago