
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే ‘మిరాయి’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా హీరో నితిన్ సరసన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఊహించని విధంగా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతేడాది వచ్చిన ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో నితిన్ ఎలాగైనా పక్కా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సినిమాకు ఓకే చెప్పాడు.
నారి సిరిసవాడ, సోమశేఖర్ అనే ఇద్దరు యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. లాంఛింగ్ కు కూడా రితికా వచ్చింది. ఇప్పుడు ఆమెను తప్పించి, ఆ స్థానంలో వైష్ణవి చైతన్యను తీసుకున్నట్టు తెలుస్తోంది.
హిట్ హీరోయిన్ కోసం ఎవరైనా తహతహలాడతారు. సెంటిమెంట్ గా ఉంటుందని, క్రేజ్ కలిసొస్తుందని భావిస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి రితికానుత ప్పించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె స్వచ్ఛందంగా తప్పుకుందా, లేక తప్పించారా అనేది తేలాల్సి ఉంటుంది. అంతకంటే ముందు, ఈ వార్తపై యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
