కొన్ని మంచి మంచి పాత్రలు సినిమాల్లో దొరకవు. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ కంటెంట్ రూపంలో అలాంటివి అందుబాటులోకి వస్తుంటాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న చాలామంది నటీనటులు అలాంటి పాత్రలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. మరీ ముఖ్యంగా లైమ్ లైట్లో ఉన్నోళ్లు అస్సలు చూడరు. కానీ సాయిపల్లవి మాత్రం అలాంటి ఓ పాత్రకు ఓకే చెప్పింది.
అవును.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించబోతోంది సాయిపల్లవి. వెట్రిమారన్ డైరక్ట్ చేయబోయే ఈ సిరీస్ మొత్తం సాయి పల్లవి చుట్టూ తిరుగుతుంది. మరో కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరూ సిరీస్ లో తండ్రికూతుళ్లుగా కనిపిస్తారు. తమిళనాట ఉన్న సామాజిక అంశాలు, ప్రస్తుతం ఉన్న సమస్యల్ని స్పృశిస్తూ ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. వీటిలో పరువు హత్య అంశం కూడా ఒకటి.
ప్రస్తుతం సాయిపల్లవి చేస్తున్న 2 తెలుగు సినిమాలు ఫైనల్ స్టేజ్ లో ఆగిపోయాయి. వీటిలో ఒకటి ‘లవ్ స్టోరీ’ కాగా.. ఇంకోటి ‘విరాటపర్వం’. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఆమె చేయబోయే వెబ్ సిరీస్ పై క్లారిటీ వస్తుంది.
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో…
'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్…
కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న…
తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె…
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…