లాక్ డౌన్ ఇలా పడిందో లేదో సోనూ సూద్ అలా హీరో అయిపోయాడు. వలస కార్మికుల్ని ఆదుకోవడం, అన్నదానం చేయడం, కార్మికులను వాళ్ల సొంతూళ్లకు పంపించడం, తన హోటల్ ను మెడికల్ సిబ్బందికి ఇచ్చేయడం.. ఇలా చేతికి ఎముకే లేనట్టు దానాలు చేస్తున్నాడు సోనూ సూద్. దీంతో ఇప్పుడు అతడి ఆస్తిపై అందరి దృష్టి పడింది.
దాదాపు 3 నెలలుగా ప్రతి రోజూ దానాలు చేస్తున్న సోనూ సూద్ కు అసలు ఎంత ఆస్తి ఉందనే చర్చ ఊపందుకుంది. సోనూ దాదాపు 15 ఏళ్లుగా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాపులర్ నటుడు. తన క్రేజ్ కు తగ్గట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. దీనికి తోడు అతడికి హోటల్ బిజినెస్ కూడా ఉంది. ఇవి కాకుండా వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే సోనూ సూద్ కు అటుఇటుగా 130 కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చని ఓ అంచనా.
అయితే సోనూ సూద్ కు ఎంత ఆస్తి ఉందనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఆయనకు ఎంత పెద్ద మనసు ఉందనేది ఇంపార్టెంట్. సోనూ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆస్తి ఉన్న స్టార్స్ ఇండియాలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్లందరికంటే ఇప్పుడు సోనూనే హీరో అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యం డబ్బు కాదు. ఆ చొరవ, ఆ మంచితనం. అదే ఇప్పుడు సోనూను హీరోను చేసింది.
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన "లెనిన్" (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి,…
ఇప్పటికే లవ్ లైఫ్, పెళ్లి, డేటింగ్ లాంటి అంశాలపై ఓపెన్ గా స్పందించింది శ్రీలీల (Sreeleela). ఎప్పుడూ పక్కనే అమ్మ…
'ఎల్లమ్మ' (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది.…
సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…
మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్…