ఈ సినిమావాళ్లు ఒక్కోసారి మరీ అతి చేస్తారు. వాళ్లు తీసిన సినిమానే ఆణిముత్యం అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తారు. ప్రమోషన్ కోసం అలా చేస్తారా.. లేక సినీజనాల మనస్తత్వమే అంతా అనేది ఎవ్వరికీ అర్థం కాదు. తాజాగా ఈ లిస్ట్ లోకి నటి షకీలా చేరిపోయింది.
ఈమె నిర్మాతగా మారి ఈమధ్య ఓ సినిమా తీసింది. దాని పేరు “లేడీస్ నాట్ ఎలౌడ్”. టైటిల్ చూస్తేనే సినిమా కంటెంట్ ఏంటనే విషయం అర్థమౌతుంది. ఈ సినిమా ఎంత పచ్చిగా ఉంటుందంటే చెన్నై నుంచి ఢిల్లీ వరకు తిరిగినా సెన్సార్ అవ్వలేదు. ఇప్పుడీ సినిమా పైరసీ అయిందని గోల పెడుతోంది షకీలా.
రీసెంట్ గా ఈ మూవీని వెబ్ లో రిలీజ్ చేసింది షకీలా. మూవీకి 50 రూపాయల టిక్కెట్ ధర నిర్ణయించింది. అయితే ఎవ్వరూ టిక్కెట్టు పెట్టి తమ సినిమా చూడడం లేదని, అంతా పైరసీ సైట్స్ లో చూస్తున్నారని మండిపడింది. ఈ మేరకు పైరసీ చేసినవాళ్లను తిడుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది.
పైరసీ చేయడం తప్పే. కానీ “లేడీస్ నాట్ ఎలౌడ్” అనే సినిమా పైరసీకి కూడా పనికిరాని సినిమా…. ఇంత బోరింగ్ గా ఉందని టాక్. ఈ సినిమాను ఉచితంగా చూపించినా ఎవ్వరూ చూడరు అంటూ చూసినోళ్లు కామెంటేడుతున్నారు. అలాంటి సినిమాను పైరసీ చేశారంటూ బాధపడుతోంది షకీలా. తనకు డబ్బులు రావడం లేదని తెగ ఇదైపోతోంది.
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో…
'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్…
కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న…
తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె…
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…