శర్వానంద్ తాజా చిత్రం “మనమే.” ఈ సినిమాలో శర్వా సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజాగా ట్రయిలర్ రిలీజైంది. అందులో హీరోహీరోయిన్ల గిల్లికజ్జాల్ని చూపించారు. పరస్పరం విరుద్ధ భావాలు, ఆలోచన విధానం కలిగిన కపుల్ గా శర్వా-కృతి కనిపించారు.
ఈ సందర్భంగా ఓ కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చాడు శర్వానంద్.
హీరోహీరోయిన్లు తిట్టుకుంటే సినిమాసూపర్ హిట్టు అవుతుందట. రెండు సినిమాల్ని కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. మురారి, ఖుషి సినిమాల్లో హీరోహీరోయిన్లు ఒకర్నొకరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఆ ఘర్షణ నుంచే ఓ మేజిక్ మూమెంట్ పుట్టుకొస్తుంది. అదే మేజిక్ ‘మనమే’ సినిమాకు కూడా వర్కవుట్ అవుతుందంటున్నాడు శర్వా.
శ్రీరామ్ ఆదిత్య డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అతడి కొడుకు కీలక పాత్ర చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ సంగీతం అందించాడు. 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది మరి శర్వానంద్ చెప్తున్న తిట్టు సెంటిమెంట్ వర్క్ అవుతుందా?
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…