విడుదలకు ముందు ‘డియర్ కామ్రేడ్’ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. సినిమా ఫ్లాప్ అయింది. ఐతే, ఈ సినిమాని ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు. అందులోని పాటలు ఇప్పటికీ పాపులర్.
అందుకే, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో రీమేక్ చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా ఈ సినిమా హిందీలో రూపొందనుంది అని వార్తలు వచ్చాయి.
ఐతే, ఈ కుర్ర హీరో తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ వార్తలపై స్పందించాడు. “నేను ఇకపై రీమేక్ సినిమాలు చెయ్యాలని అనుకోవడం లేదు. ఈ సినిమా నాకు ఇష్టమే. అందులో నటించిన హీరో, హీరోయిన్ కూడా ఇష్టమే. కానీ ఆ మూవీ రీమేక్ చెయ్యడం లేదు,” అనే అర్థంలో క్లారిటీ ఇచ్చాడు.
మరి “డియర్ కామ్రేడ్” హిందీ రీమేక్ లో ఏ బాలీవుడ్ హీరోని కరణ్ జోహార్ ఒప్పిస్తాడో చూడాలి.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…