నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ఆసక్తికర ప్రకటన చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని తను గతంలోనే చెప్పానని, ఇప్పుడు అందులో సగం నెరవేరిందని అన్నాడు.
“దేశం కోసం గొప్ప పనులు చేసే ప్రతి ఒక్కరూ ‘భారతీయుడే’. అలాంటి ఒక భారతీయుడు నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ సీఎం నా ఫ్రెండ్ అని ఒక రోజు గర్వంగా చెప్పుకుంటానని మూడేళ్ల క్రితం చెప్పాను. అది సగం నెరవేరింది. మిగతా సగం ప్రజలే నెరవేర్చాలి.”
ఇలా పవన్ కల్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఎస్ జే సూర్య. “భారతీయుడు-2” సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ గురించి మాట్లాడాడు
పవన్ తో “ఖుషి” సినిమా తీసింది ఇతడే. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో “కొమురం పులి” సినిమాను కూడా తెరకెక్కించాడు. వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
జీవితంలో తను చూసిన అతికొద్దిమంది మంచి వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ఒకరని, ఎస్ జే సూర్య సందర్భం దొరికిన ప్రతిసారి చెబుతుంటాడు. ఈసారి కూడా అదే పని చేశాడు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…