ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు ఓ సెలబ్రిటీకి మరో సెలబ్రిటీ సడెన్ గా తారసపడుతుంటారు. ఒకింత ఆశ్చర్యంగా, ఇంకాస్త ఆనందంగా వాళ్లతో మాట్లాడుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఎయిర్ పోర్టుల్లో, ఏదైనా స్టుడియోల్లో జరుగుతుంటాయి. మరి ఇదే సీన్ శ్రీవారి దర్శనంలో రిపీట్ అయితే ఎలా ఉంటుంది?
ఇది అలాంటి సన్నివేశమే. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుంది హీరోయిన్ శ్రీలీల. ఆమె దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే, దర్శనం కోసం లోపలకు వెళ్తున్నాడు తమన్. ఇద్దరూ సడెన్ గా మహాద్వారం ముందు ఒకరికొకరు ఎదురుపడ్డారు.
దీంతో ఒకింత ఆశ్చర్యం, ఆనందంతో ఇద్దరూ అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు. శ్రీలీల తన తల్లిదండ్రుల్ని తమన్ కు పరిచయం చేసింది. ఎక్సయిట్ మెంట్ లో తమన్, శ్రీలీల బుగ్గ నిమిరాడు కూడా. ఇదంతా క్యూ లైన్లోనే జరిగింది.
ఇద్దరూ సెలబ్రిటీలు కావడంతో, మిగతా భక్తులు ఏం మాట్లాడలేకపోయారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా కాసేపు అలానే ఉండిపోయారు. మొత్తానికి ఇదో మంచి జ్ఞాపకంగా ఉండిపోతుంది ఇద్దరికీ. కాకపోతే యూట్యూబ్ మొత్తం “శ్రీలీలని గిల్లిన థమన్” అనే థంబ్ నెయిల్స్ తో హోరెత్తింది.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…