టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన శ్రీలీల కూడా బాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె మొదటి బాలీవుడ్ చిత్రం.. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న “ఆషీకీ 3”. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. శ్రీలీల ముంబైలోనే ఉంటుంది. ఆ షూటింగ్ తో బిజీగా ఉంది.
అదింకా విడుదల కాకముందే శ్రీలీల మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు కమిటైంది. సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా త్వరలోనే మొదలు కానున్న సినిమాలో కూడా శ్రీలీలను తీసుకున్నారట. ఇబ్రహీం నటించిన మొదటి చిత్రం …నాదానియా. ఈ సినిమా రెండు రోజుల క్రితమే డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇబ్రహీం చూడ్డానికి బాగున్నాడు కానీ నటన శూన్యం అని విమర్శకులు తేల్చారు. సైఫ్ అలీ ఖాన్ కి కూడా మొదట్లో అలాంటి కామెంట్స్ వచ్చాయి. సో, ఇబ్రహీంకి కూడా మంచి కెరీర్ ఉంటుంది. రెండో సినిమాకి అప్పుడే వర్క్ జరుగుతోంది.
శ్రీలీల, ఇబ్రహీం కాంబినేషన్ లో లవ్ స్టోరీ తెరకెక్కనుంది. మొత్తానికి బాలీవుడ్ లో బిజీగా మారనుంది ఈ తెలుగు భామ.
అన్నట్లు శ్రీలీలకు హిందీ కూడా బాగా వచ్చంట. హిందీలో ఆమె డైలాగులు చెప్పుకుంటుందట.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…