గత వీకెండ్ బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీ పెద్ద కలకలం రేపింది. పోలీసులు ఆ పార్టీని భగ్నం చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ముందుగా తెలుగునటి హేమ పేరు బయటికి వచ్చింది. ఆ తర్వాత శ్రీకాంత్ పేరు వినిపించింది.
అసలు తాను బెంగుళూరులో లేనని, హైదరాబాద్ లోనే ఉన్నాను అని నటి హేమ ఒక వీడియో విడుదల చేసింది. ఎవరో హేమ అనే మరో వ్యక్తి అక్కడ ఉండొచ్చు అని చెప్పింది.
ఇక ఇప్పుడు శ్రీకాంత్ కూడా వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు.
“నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి,” అని శ్రీకాంత్ అన్నారు.
“రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాకయ్యాను. దయచేసి ఎవరూ నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు, పబ్స్ వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు,” అని శ్రీకాంత్ వివరణ ఇచ్చారు.
“మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దు. విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు.”
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…