లయ నటన గురించి మాట్లాడుతూ ఆమె అప్పట్లో నందులను తెగ లాగేసుకునేది అని అన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి. ఆ క్రమంలో నందులు పందులు అనే ప్రాస వాడి ఆయన ఇరుకున పడ్డారు. తాజాగా ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
నంది అవార్డు అందుకోవాలనేది నాకల
”ఆ ఈవెంట్‌లో చిన్నగా మాట దొర్లాను. అది నా స్టేట్‌మెంట్ కాదు. 12 సంవత్సరాల క్రితం ఎవరో అన్న స్టేట్‌మెంట్‌ను గుర్తు చేశాను. అప్పట్లో ఇలా అనేవారు అనబోయి అలా మాట దొర్లింది. నాకు దేవుడి మీద , అవార్డ్స్ మీద అపారమైన గౌరవం వుంది. దేవుడి అంటే ఎంతో భక్తి ఉందో, అవార్డ్స్ మీద కూడా గౌరవం ఉంది. నాకు చిన్నప్పటి నుండి నంది అవార్డ్స్ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే సినీ పరిశ్రమకు వచ్చాను,” అని నందిపాటి క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల సుహాస్, శివానీ నగారం జంటగా రూపొందిన “హే బల్‌వంత్” సినిమాని ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా థాంక్యూ మీట్ ఫర్ బ్రేక్ ఈవెన్ డన్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్బంగా ఆయన వివరణ ఇచ్చారు.
“హే బల్‌వంత్ సినిమాను దాదాపు 10 క్లోట బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్ ఇతర హక్కులు, థియేటర్స్ కలెక్షన్స్ అన్ని కలిసి ఆ పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో ప్రాఫిట్స్ జోన్‌లోకి వెళతాం,” అన్నారు.
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…
ఒక వయసు వచ్చిందంటే చాలు, పెళ్లెప్పుడు అని అడిగే సమాజంలో ఉన్నాం. అసలు పెళ్లి ఎందుకు, ఇలా సోలోగా ఉండలేమా…
వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా…
రామ్ చరణ్ (Ram Charan) నటించిన "పెద్ది" (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ…
వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా…