నాని (Nani) ఒక్క ప్రణాళిక ప్రకారం సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. నేచురల్ స్టార్ గా కాకుండా మాస్ స్టార్ గా ఉండాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. దసరా, హిట్ 3 వంటి సినిమాలు అలా చేసినవే. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ (The Paradise)తో పాన్ ఇండియా మార్కెట్ ని కొట్టాలని కసిగా ఉన్నాడు. పక్కాగా అల్లు అర్జున్ పద్దతిని ఫాలో అవుతున్నాడు.
“పుష్ప” విడుదల వరకు అల్లు అర్జున్ కేవలం తెలుగులో పెద్ద హీరో. కానీ “పుష్ప” మొదటి భాగం హిందీలో కొంత పాపులర్ కావడంతో చాలా తెలివిగా రెండో భాగం హిందీ ప్రేక్షకులకు ముఖ్యంగా మాస్ వాళ్లకు నచ్చేలా తన సినిమాని డిజైన్ చేయించాడు సుకుమార్ తో. ఊర మాస్ దుస్తులు, మేనరిజమ్స్, భారీ ఫైట్లు, ఓవర్ డైలాగులు, రొమాన్స్, మాస్ కి నచ్చే డ్యాన్స్ స్టెప్పులు… ఇలా సాగింది “పుష్ప” చిత్రం. దాంతో “పుష్ప 2” అనూహ్య విజయం సాధించింది.
పుష్ప 2″ హిందీ వెర్షన్ ఏకంగా ఇండియాలో 800 కోట్లపైనే కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇండియాలోనే పెద్ద హీరోలలో ఒకరిగా నిలిచాడు. రాజమౌళి సినిమాల్లో నటించకుండానే సొంతంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్.
ఇప్పుడు నాని కూడా “ది ప్యారడైజ్” సినిమాతో అదే పద్దతిలో వెళ్తున్నాడు. మొదటిసారి చాలా కస్టపడి డ్యాన్స్ చేశాడు. తాజాగా విడుదలైన “ఆయా షేర్” పాటలో అచ్చంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తరహాలో మాస్ స్టెప్పులు వేసి అందరి అటెన్సన్ పొందాడు. రెండు జెల్ల గెటప్ తో మాస్ ని టార్గెట్ చేస్తున్నాడు.
నాని చాలా కాలంగా హిందీ మార్కెట్ ని కైవసం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఈ సినిమాతో ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నాడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…