Categories: న్యూస్

సారీ చెప్పిన వేణుస్వామి

వేణుస్వామి వివాదం కొలిక్కి వచ్చింది. నాగచైతన్య-శోభిత పెళ్లికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ జ్యోతిష్యుడు, తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు కమిషన్ కు లేఖ సమర్పించాడు.

నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేసుకున్న వెంటనే సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు వేణు స్వామి. వాళ్లిద్దరి పెళ్లి నిలవదని, ఎక్కువ రోజులు కలిసి కాపురం చేయరని జాతకం చెప్పాడు. దీనిపై చాలామంది భగ్గుమన్నారు. ఇంకా పెళ్లి కూడా చేసుకోకుండా వేణుస్వామి ఇలా మాట్లాడ్డం సరికాదంటూ విమర్శించారు.

జరిగిన ఘటనపై ఫిలిం జర్నలిస్ట్ యూనిట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. కమిషన్ నోటీసులివ్వగా, దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు వేణుస్వామి. హైకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

దీంతో మహిళా కమిషన్ మరోసారి ఆయనకు నోటీసులివ్వగా, ఈరోజు కమిషన్ ఎదుట హాజరైన వేణు స్వామి, భేషరతుగా క్షమాపణలు చెబుతూ లెటర్ ఇచ్చారు. మహిళల గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసిన కమిషన్, భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ రిపీట్ చేయకూడదని వేణుస్వామిని ఘాటుగా హెచ్చరించింది.

Admin

Recent Posts

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

5 hours ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

5 hours ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

1 day ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

1 day ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

1 day ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

1 day ago