కోపం అందరికీ వస్తుంది. దీనికి హీరోలు కూడా అతీతం కాదు. అలా కోపం వచ్చినప్పుడు కూల్ అవ్వడానికి ఒక్కొక్కరికి ఒక్కో మార్గం ఉంటుంది. అయితే వెంకీది అంతా డిఫరెంట్ స్టయిల్. మరి కోపం వస్తే ఆయనేం చేస్తారు.
ఇక్కడే ఓ గమ్మత్తైన విషయం బయటపెట్టారు వెంకటేశ్. తనకు అసలు కోపం రాదనేది ఆయన సమాధానం. తను ఎప్పుడూ కూల్ గా ఉంటానని, ఎవరో వచ్చి తనను కూల్ చేయాల్సిన అవసరం లేదంటారాయన.
జీవితంలో ఎలాంటి టెన్షన్లు పెట్టుకోనని, ఎదుటి వ్యక్తితో వాగ్వాదం పెట్టుకోనని, అలాంటప్పుడు తనకు కోపం ఎందుకు వస్తుందని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, తన దగ్గర సీక్రెట్స్ కూడా ఉండవంటున్నారు.
వెంకీ వాడుతున్న ఫోన్ కు పాస్ వర్డ్ కూడా ఉండదంట. ఫేస్ లాక్ లాంటివి తను పెట్టుకోనని, మిగతా కోడ్స్ అన్నీ తన కుటుంబంలో అందరికీ తెలుసని, తన ఫోన్ లో ఎలాంటి సీక్రెట్స్ ఉండవని అంటున్నారు వెంకీ. గడిచిన పాతికేళ్లుగా ప్రశాంతంగా ఉండడంపై ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపు ఆయన సాధించారు.
"గ్యాప్ రాలేదు, తీసుకున్నాను". బన్నీ నటించిన సినిమా హిట్ లో డైలాగ్ ఇది. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ చేస్తోంది…
80లలో హైదరాబాద్ సినిమా సంస్కృతి, భారతీరాజా (Bharathiraja) శకం మొదలైనప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు శ్రీ అట్లూరి మాటల్లో… హైదరాబాద్‌లోని శాంతి…
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…
'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…