విశ్వక్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? ఈ ప్రశ్న అడిగిన ప్రతిసారి నాకా.. పెళ్లా.. అప్పుడేనా.. నేనింకా చిన్న పిల్లాడ్ని అంటూ వయసు లెక్కలు చెప్పేవాడు విశ్వక్. అయితే ఈమధ్య ఈ హీరో మాట మార్చాడు. తనకు కూడా వయసు పెరుగుతోందని, వయసుతో పాటు మెచ్యూరిటీ కూడా పెరుగుతోందని అన్నాడు. అందుకే ఇకపై అతిగా రియాక్ట్ అవ్వనని కూడా అన్నాడు. సెటిల్ గా ఉంటానని మాటిచ్చాడు కూడా.
సో.. వయసొచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలి కదా. మరోసారి విశ్వక్ కు అదే ప్రశ్న ఎదురైంది. ఈసారి ఈ హీరో తప్పించుకోలేదు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. సంబంధాలు చూడమని ఇంట్లో అమ్మకు కూడా చెప్పాడంట.
అంటే, ఇంట్లో చూసిన సంబంధం చేసుకోబోతున్నాడన్నమాట. విశ్వక్ ఎవ్వర్నీ ప్రేమించడం లేదన్నమాట. ఇలా గుసగుసలాడుతుంటున్నారు జనం. ఈకాలం ఓ హీరో, యూత్ లో మంచ ఫాలోయింగ్ ఉన్న నటుడు, ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటానని చెప్పడం కొంత వింతగా, ఇంకాస్త కొత్తగా అనిపించడం సహజం.
‘హిట్-3’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన విశ్వక్, తన పెళ్లి మేటర్ ను ఇలా బయటపెట్టాడు. చూస్తుంటే, త్వరలోనే పెళ్లి కబురు మోసుకొచ్చేలా ఉన్నాడు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…