ఈ వీకెండ్ 5 స్ట్రయిట్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మూవీ మాత్రం ఒక్కటే. అదే ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై ఆడియన్స్ లో ఓ మోస్తరు అంచనాలున్నాయి. విడుదలైన 2 ట్రయిలర్స్ హిట్ అవ్వడంతో పాటు హీరోయిన్ సాయి పల్లవికి క్రేజ్ పెరగడంతో సినిమాపై అందరి చూపు పడింది.
రేపు రిలీజ్ అవుతున్న సినిమాల్లో వైశాఖం కూడా ఉంది. పీఆర్వో బీఏ రాజు భార్య బి.జయ ఈ సినిమాకు దర్శకురాలు. హరీష్, అవంతిక హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. నాగార్జున, మహేష్, నాని లాంటి స్టార్లు ఈ సినిమాకు ప్రచారం కల్పించారు.
ఈ రెండు సినిమాలతో పాటు దండుపాళ్యం-2, టీమ్-5, మాయామాల్ అనే మరో 3 సినిమాలు కూడా వస్తున్నాయి. కన్నడంలో సూపర్ హిట్ అయిన దండుపాళ్యంకు రీమేక్ గా పార్ట్-2 వస్తోంది. క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా టీమ్-5 వస్తోంది. ఇక హారర్ కాన్సెప్ట్ తో ముస్తాబైంది మాయామాల్. వీటిలో ఈ వీకెండ్ ఏది క్లిక్ అవుతుందో చూడాలి.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…