Categories: న్యూస్

ఎన్టీఆర్ మైండ్ లోకి రాలేదంట?

నందమూరి వంశానికి హార్డ్ కోర్ ఫ్యాన్ వైవీఎస్ చౌదరి. హరికృష్ణకు సీతయ్య రూపంలో అదిరిపోయే హిట్టిచ్చాడాయన. హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు చేశాడు. ఇప్పుడు హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారకరామారావుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై ఆయన భార్య యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ పాటలు, సాయి మాధవ్‌ బుర్రా మాటలు రాయనున్నారు. అలాగే ఈ సినిమాలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వైవీఎస్అనౌన్స్ చేశారు.

అయితే నందమూరి కుటుంబంలో ఆర్డర్ ప్రకారం చూస్తే వైవీఎస్ జూనియర్ ఎన్టీఆర్ ని మిస్సయ్యాడు. ఆర్డర్ ప్రకారం చూసుకుంటే.. హరికృష్ణ, బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. కానీ వైవీఎస్ చేయలేదు. దీనికి ఆయన తన లాజిక్ చెబుతున్నాడు.

“నేనే కథ రాసుకొని, నేనే సినిమా తీసే ప్రాసెస్ లో చాలామంది హీరోల వద్దకు వెళ్లే అవకాశాలు తక్కువ. రెగ్యులర్ గా సినిమాలు చేస్తేనే అందరి దగ్గరకు వెళ్లాలి. లాహిరి లాహిరి సినిమా చేసిన తర్వాత మళ్లీ హరికృష్ణ గారితోనే సీతయ్య చేశాను. పెద్ద హీరోల దగ్గరకు వెళ్లి కథ చెప్పి సినిమా తీయాలనే ఆలోచన నా బ్రెయిన్ కు రాలేదు. స్టార్ డమ్ చూడను, నేను కథ రాసుకున్న తర్వాత ఆ కథకు, నాకు కన్వీనియంట్ గా ఎవరు అనిపిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లిపోతాను. తారక్ దగ్గరకు వెళ్లాలనే ఆలోచన పుట్టించే కథ నాకు రాలేదు. అలాంటి కథ వస్తే కచ్చితంగా తారక్ దగ్గరకు వెళ్తాను.”

పెద్ద ఎన్టీఆర్ కు ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదని.. మనవళ్లంతా ఆయనకు సమానమేనని అన్నారు. అదే విధంగా నందమూరి అభిమానులందరికీ ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అందరూ సమానమేనని అంటున్నారు వైవీఎస్.

వైవీఎస్, వైవీఎస్ చౌదరి, ఎన్టీఆర్,

Admin

Recent Posts

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

2 hours ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

7 hours ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

8 hours ago

Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్

తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…

8 hours ago

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

1 day ago

నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…

1 day ago