అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక చెమట్లు కక్కుతున్న పోలీసులు. అలాంటి టైమ్ లో కూల్ గా సీన్ లోకి ఎంటరయ్యాడు దర్శకుడు అనుదీప్ కెవి. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ నడుచుకుంటూ దాదాపు స్టేజ్ వరకు వచ్చేశాడు.
సరిగ్గా స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి ఊహించని పరిణామం. అనుదీప్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఒక పోలీస్ అయితే ఏకంగా అనుదీప్ పై చేయి వేసి, వెనక్కు నెట్టాడు. అప్పటివరకు కూల్ గా నడుచుకుంటూ వచ్చిన అనుదీప్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తను ఎవరు, ఎందుకు అక్కడికి వచ్చాననే విషయాన్ని పోలీసులకు చెప్పాడు.
అప్పటికే అక్కడున్న పవన్ ఫ్యాన్స్, అనుదీప్ ఎవరనే విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు తప్పియిందంటూ, చిన్నగా నవ్వేసి, అనుదీప్ కు దారిచ్చారు. అలా స్టేజ్ ముందుకొచ్చి, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి, తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు అనుదీప్.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అద్భుతమైన కామెడీ సినిమా అందించిన అందించిన అనుదీప్ పైనే సోషల్ మీడియాలో పిచ్చ కామెడీ నడిచింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రయిలర్ లాంఛ్ సందర్భంగా జరిగింది ఈ ఘటన.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…