ఈవీ కార్లు కొంటున్న స్టార్స్

TeluguCinema 22 Apr 2023
evcars

టాలీవుడ్ హీరోలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై మోజు పెంచుకుంటున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి హైబ్రిడ్ (పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్) కారు కొన్నారనేది తెలిసిందే. దాని ఖరీదు కోటి రూపాయలు. అలాగే రవితేజ కూడా 35 లక్షలు పెట్టి ఎలక్ట్రిక్ కారు కొన్నారు.

తాజాగా అల్లరి నరేష్ కూడా కియా కంపెనికి చెందిన ఎలక్ట్రిక్ కారుని తీసుకున్నారు. ఈ కారుకి మంచి ఫ్యాన్సీ నంబర్ కావాలని 94 వేలు వెచ్చించారు. టీఎస్‌ 09 జీబీ 2799 నంబర్‌ కోసం అల్లరి నరేష్ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా రూ.94,899 చెల్లించారు.

చిరంజీవి తన నంబర్ కోసం 5 లక్షలు చెల్లించగా, రవితేజ 17 వేలు చెల్లించారు.

ఐతే, మిగతా కార్లు ఎన్ని వున్నా ఒక ఎలక్ట్రిక్ వెహికిల్ ఉండాలని హీరోలు భావిస్తున్నట్లు ఉంది. హైదరాబాద్ సిటీలో తిరగడానికి బాగుంటుంది అనేది వారి భావన. బయటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రెగ్యులర్ లక్జరీ కార్లు వాడుతారు.

TeluguCinema

View all posts

Recent News