‘అవతార్ 3’ రెండేళ్లు వాయిదా

TeluguCinema 14 Jun 2023
Avatar 2

‘అవతార్’ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజుంది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ‘అవతార్ 2’ కూడా ఘన విజయం సాధించింది. ఆల్ టైం హిట్స్ జాబితాలో చేరింది. రెండో పార్ట్ కూడా విజయం సాధించడంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 3’పై ఫోకస్ పెట్టారు. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేశారు.

హాలీవుడ్ లో కొనసాగుతున్నస్క్రిప్ట్ రైటర్ల సమ్మె వల్ల నెల రోజులుగా షూటింగ్ లు, ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. దాంతో, ‘అవతార్ 3’ పనులు కూడా నత్త నడకన సాగుతున్నాయి. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యం కానున్నాయి. దాంతో ‘అవతార్ 3’ ని 2025 క్రిస్మస్ కానుకగా విడుదల చెయ్యాలని నిర్ణయించారు.

ఇప్పటికే అవతార్ 4, అవతార్ 5 కూడా ఉంటుందని జేమ్స్ కామెరూన్ చెప్పారు. ఐతే, ఈ సినిమాలు ఇప్పట్లో విడుదల కావు. ‘అవతార్ 4’ 2029లో, ‘అవతార్ 5’ 2031లో విడుదల అవుతాయి. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు.

మొత్తమ్మీద, జేమ్స్ కామెరాన్ మరో 8 ఏళ్ళు ఈ ‘అవతార్’ చిత్రాలపనిలోనే నిమగ్నం అయి ఉంటారు. ఆయన ఈ సినిమాలతోనే ఇక రిటైర్ అయ్యే అవకాశం ఉంది.