వరుణ్ పెళ్ళిలో మెగా ఫ్రేమ్!

TeluguCinema 02 Nov 2023
megaframe varunwedding


వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. ఇటలీలోని టస్కనీ అనే ప్రాంతంలో ఒక రిసార్ట్ ని బుక్ చేసుకొని అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య. ఈ జంట పెళ్ళి వేడుకకు మొత్తం మెగా ఫ్యామిలీ హాజరైంది.

పెళ్ళికి ముందు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలు విడుదల అయ్యాయి. ఆ ఫొటోల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. దాంతో, పవన్ కళ్యాణ్ పెళ్ళికి వెళ్ళలేదు అన్న టాక్ మొదలైంది. ఐతే, తాజాగా మొత్తం మెగా హీరోలు కొత్త జంటతో కలిసి దిగిన ఫోటో బయటికి వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.

వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి పీటలపై కూర్చుంటే వారి వెనకాల మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ నిల్చున్న ఈ మెగా ఫ్రేమ్ వైరల్ అయింది.

ALSO CHECK: Varun Tej and Lavanya Tripathi tie the knot in Italy

వరుణ్ తేజ్, లావణ్య ఈ ఆదివారం తమ వెడ్డింగ్ రెసెప్షన్ ని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోనే వీరి కాపురం.

TeluguCinema

View all posts

Recent News