డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయిస్తున్నారట!

హీరోయిన్ రష్మిక హర్ట్ అయింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది. కొంతమంది డబ్బులిచ్చి మరీ తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రష్మిక చేసిన ప్రకటనతో కొత్త చర్చ మొదలైంది.
ఆమె బాలీవుడ్ కు వెళ్లిన తర్వాతే ట్రోలింగ్ ఎక్కువైంది. దీంతో బాలీవుడ్ కు చెందిన వ్యక్తులే ఆమెపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే అది ఎవరై ఉంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
తమనుదాటి ముందుకెళ్లేవాళ్లను కిందకు లాగడానికి ప్రయత్నించడం ఎక్కడైనా కామన్. బాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలు చాలా ఎక్కువ. కాబట్టి ప్రస్తుతం రష్మికకు పోటీ ఇస్తున్న హీరోయిన్లలో ఒకరు ఈ పని చేసి ఉంటారంటూ భావిస్తున్నారు చాలామంది.
భారీ సక్సెస్ ల వల్లే?
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో దూసుకుపోతోంది. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఆమెకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను తగ్గించడం కోసం ఇలా ఆమెపై నెగెటివ్ ప్రచారం జరుగుతోందంటున్నారు.

రష్మిక మందానకి తెలుగులో కన్నా హిందీలో భారీ హిట్స్ ఉన్నాయి. “యానిమల్” 900 కోట్లు కలెక్ట్ చేసింది. “పుష్ప 2” 1800 కోట్లు కలెక్ట్ చేసింది. “చావా” 500 కోట్ల వసూళ్లు అందుకొంది. అందుకే ఆమెని టార్గెట్ చేశారా?