సాయిదుర్గతేజ్ తో మారుతి

TeluguCinema 17 Aug 2025
Sai Durgha Tej

మారుతికి మెగా కాంపౌండ్ కు మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ కు చాలా క్లోజ్ మారుతి. అదే అనుబంధంతో అల్లు శిరీశ్, సాయిదుర్గతేజ్ లాంటి హీరోలతో మెగా కాంపౌండ్ లో సినిమాలు చేశాడు మారుతి.

ఇప్పుడు మరోసారి ఆ కాంపౌండ్ లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నాడు ఈ దర్శకుడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సాయిదుర్గతేజ్ తో మారుతి మరో సినిమా చేయబోతున్నాడు. అయితే ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది.

ఈసారి సాయిదుర్గతేజ్ ను హీరోగా పెట్టి, తను నిర్మాతగా మారి సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. మారుతి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించబోతున్నాడట

ప్రస్తుతానికి ఈ దర్శకుడు”రాజ్ సాబ్” పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ సినిమా రిలీజైన తర్వాత మారుతి తన కొత్త సినిమా వివరాలు వెల్లడిస్తాడు.