100లో నేనే హీరో: నాగార్జున

TeluguCinema Team 20 Aug 2025
Nagarjuna Akkineni

నాగార్జున ఇటీవల రూట్ మార్చారు. ఆయన ఇక హీరో పాత్రలు మానేసి విలన్ గా నటిస్తారు అని అందరూ ఫిక్స్ అయిపోయారు ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాలు చూసి. ఎందుకంటే ‘కూలీ’లో ఆయనది పూర్తి స్థాయి విలన్ పాత్ర. అలాగే ‘కుబేర’లో అటు విలన్ కాదు, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ పాత్ర. ఈ రెండు సినిమాలతో ఆయన హీరోగా ఇక రిటైర్ అయినట్లే అనిపించింది.

కానీ తన తదుపరి చిత్రంలో నేనే హీరో అని ప్రకటించారు నాగార్జున.

నాగార్జున 100వ (#King100) చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కథ, ఇతర పనులు పూర్తి అయ్యాయి. ఈ నెల 29న ఈ సినిమాని ప్రకటిస్తారు. ఆ రోజు నాగార్జున పుట్టిన రోజు.

“ఆరు నెలలుగా కార్తీక్ ఆయన టీం వర్క్ చేస్తున్నారు. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇందులో మాత్రమే నేనే హీరో,” అని తెలిపారు నాగార్జున.

ఈ సినిమా కూడా యాక్షన్ తో కూడుకున్నదేనట. “కింగ్ 100” (#King100) అని ఈ సినిమాకి ప్రస్తుతం పేరు. అసలైన పేరు ప్రకటించేంత వరకు #King100 ఈ టాగ్ తో ప్రచారం చేస్తారు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News