విలన్ గా నటిస్తాను: అనుష్క

అనుష్క నటించిన “ఘాటీ” ఎల్లుండి (సెప్టెంబర్ 5) విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అనుష్క మీడియాతో ఫోన్ ఇంటర్వ్యూలు చేసింది. సినిమా విశేషాలతో పాటు తన కొత్త సినిమాల గురించి కూడా చెప్పింది.
అనుష్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు. బయట కూడా ఎక్కువగా కనిపించదు. మరి ఆమె ఏమి చేస్తుంటారు? “నేను చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తాను. చదువుతాను. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను. మూవీస్ కూడా చూస్తాను. గత రెండేళ్లుగా ఎక్కువగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాను,” అని అసలు విషయం చెప్పింది.
ఆమెకి నటిగా ఒక బలమైన కోరిక ఉందట. “అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. ఒక బలమైన క్యారెక్టర్ కుదిరితే కచ్చితంగా విలన్ పాత్ర పోషిస్తాను,” అని తెలిపింది అనుష్క .
కొత్త సినిమాలు ఏంటి? సినిమాలు చేస్తారా? “మంచి లైన్ అప్ ఉంది. మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాను. అది నా ఫస్ట్ మలయాళం ఫిల్మ్. తెలుగులో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది,” అనుష్క వివరించింది.