ధనుష్ ‘ఇడ్లీ’ నలిగిపోతుందా?

TeluguCinema 04 Sep 2025
Idly Kottu

ధనుష్ హీరోగానే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. తన దర్శకత్వంలో రూపొందిన మరో చిత్రం…ఇడ్లీ కడాయి (Idly Kadai. ఈ తమిళ చిత్రం తెలుగులో “ఇడ్లీ కొట్టు” (Idly Kottu) పేరుతో డబ్ అవుతోంది.

అక్టోబర్ 1న విడుదల కానుంది ఈ మూవీ. ఇటీవలే ధనుష్ తెలుగులో హీరోగా “కుబేర”తో విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొడతాడా అనేది చూడాలి. కానీ ఈ సినిమా విషయంలో ధనుష్ కి చాలా ఇబ్బందులు ఉన్నాయి.

ఈ సినిమాపై హైప్ లేదు. పైగా ఇది తెలుగు మార్కెట్ లో “ఓజి” విడుదలైన వారానికే వస్తోంది. ఒకవేళ “ఓజీ” కనుక ఇప్పుడు ఉన్న హైప్ కి తగ్గట్లు విడుదల తర్వాత మంచి టాక్ తెచ్చుకుంటే రెండో వారం కూడా అదరగొడుతుంది. అప్పుడు ధనుష్ “ఇడ్లీ” నలిగిపోతుంది.

పైగా, ధనుష్ మూవీ విడుదల మర్నాడే “కాంతార Chapter 1” సినిమా విడుదల కానుంది. “కాంతర”, “ఓజీ” మధ్య ఈ సినిమా పడి పచ్చడి అయిపోతుందా?

TeluguCinema

View all posts

Recent News