‘కాంతార 1’కి 125 కోట్ల డీల్

వచ్చే నెలలో రానున్న సినిమాల్లో బాగా క్రేజున్న మూవీ… ‘కాంతార 1’. ఇది ఇంతకుముందు వచ్చిన ‘కాంతార’ సినిమాకి ప్రీక్వెల్. అంటే ముందు జరిగే కథ.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ మొదలు కాలేదు. ఐతే, థియేటర్ హక్కులు, నాన్ థియటర్ అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. నైజాంలో ఈ సినిమాని మైత్రి సంస్థ విడుదల చేయనుంది.
ఇక తాజాగా ప్రైమ్ వీడియో సంస్థ ఓటిటి హక్కులుగా కొనుగోలు చేసిందట. డీల్ కుదిరింది అని అంటున్నారు. “కాంతార” బ్రాండ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రైమ్ వీడియో ఏకంగా 125 కోట్లు ఇచ్చి డీల్ సెట్ చేసిందట. సినిమా బడ్జెట్ దాదాపుగా రికవరీ అయినట్లే.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఐతే, రిషబ్ శెట్టిపైనే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది. అతనే హీరో, అతనే దర్శకుడు, రచయిత.
అలాగే ఈ సినిమా హిట్ తర్వాత అతను తెలుగులో జై హనుమాన్ సినిమాలో నటించాలి. హిందీలో ‘ఛత్రపతి శివాజీ’ సినిమా చెయ్యాలి. మళ్ళీ తెలుగులోనే మరో సినిమాలో నటించాలి.