డిసెంబర్ నుంచే కొత్త సినిమా

నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ 2” ఈ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే మొదటి టీజర్ వచ్చింది. ఏ సౌండ్ కి నరుకుతానో, ఏ సౌండ్ కి నవ్వుతానో తెలియదు అంటూ బాలయ్య పలికిన డైలాగ్ ఇది బోయపాటి సినిమా అని డౌట్ లేకుండా తేల్చింది.
ఇక డిసెంబర్ లో “అఖండ 2” విడుదల కాగానే కొత్త సినిమా మొదలు పెడుతారు బాలయ్య. వచ్చే నెలలోనే ఈ సినిమా లాంఛనంగా లాంచ్ అవుతుంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం డిసెంబర్ నుంచి స్టార్ట్. దర్శకుడు గోపీచంద్ మలినేని తీసే ఈ చారిత్రక చిత్రంలో బాలయ్య ఒక రాజులా కనిపిస్తారని టాక్.
“కాంతార” సినిమాకి కెమెరా వర్క్ అందించిన అరవింద్ కశ్యప్ ఈ సినిమాకి పని చేస్తున్నాడు.
ఇక, బాలకృష్ణ తనకి చాలా కంఫర్ట్ గా ఉండే దర్శకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. “వీర సింహ రెడ్డి” సినిమా తర్వాత మళ్ళీ గోపీచంద్ మలినేని అవకాశం ఇచ్చారు. బోయపాటితో నాలుగు చిత్రాలు చేశారు. ఆ తర్వాత క్రిష్ తో నాలుగోసారి వర్క్ చెయ్యనున్నారు.