25వ సినిమాకి పెద్ద కసరత్తు

TeluguCinema 02 Nov 2025
Naga Chaitanya

నాగ చైతన్య ప్రస్తుతం తన 24వ సినిమాలో నటిస్తున్నాడు. “విరూపక్ష” దర్శకుడు కార్తీక్ తీస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా రూపొందుతోంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాతో తన మార్కెట్ మరింత పెరుగుతుంది అని చైతన్య గట్టి నమ్మకంతో ఉన్నాడు. కథ, దర్శకుడి విజన్ పై చైతన్యకున్న ధీమా అది. అందుకే ఈ సినిమా సగం పూర్తయ్యకే మరో సినిమా ఒప్పుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

చైతన్యతో సినిమాలు తీసేందుకు ఇప్పుడు పలువురు దర్శకులు పోటీ పడుతున్నారు. ఆ మధ్య శివ కొరటాల కూడా నాగ చైతన్యని కలిశాడు. రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి కలిశాడట.

నాగ చైతన్య తదుపరి చిత్రం అతని కెరీర్ లో 25వ చిత్రం అవుతుంది. ఇది కెరీర్ లో ఇక మైలురాయి చిత్రం కాబట్టి పెద్ద దర్శకుడు అయితేనే బెటర్ అని అనుకుంటున్నాడు. ఐతే, శివ కొరటాల సినిమా ఓకె అవుతుందా లేదా అనేది చూడాలి. ఎన్టీఆర్ “దేవర 2″ని పూర్తిగా పక్కకు పెడితే శివ కొరటాల నాగ చైతన్యతోనే వెళ్తాడు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు శివకి పెద్ద హీరోలు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు.

నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య… వీరే ఇప్పుడు శివ కొరటాలకు ఉన్న ప్రత్యామ్న్యాయ హీరోలు. అందుకే నాగ చైతన్యని కలిశారు.