నయనతారకి 11 కోట్ల కారు గిఫ్ట్

హీరోయిన్ నయనతార నిన్న (నవంబర్ 18) 41వ పుట్టిన రోజు జరుపుకొంది. ఈ పుట్టిన రోజు నాడు ఆమెకి ఖరీదైన బహుమతి దక్కింది. రోల్స్ రాయిస్ కారుని ఆమె భర్త విగ్నేష్ శివన్ గిఫ్ట్ గా ఇచ్చాడు.
Rolls-Royce కి చెందిన Black Badge Spectre మోడల్ కారు అది. ఈ కారు ఖరీదు అక్షరాలా 11 కోట్ల రూపాయలు. ఇంత ఖరీదైన కారుని ఆమె భర్త విగ్నేష్ అందించడమే కాదు ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. విగ్నేష్ తమిళంలో దర్శకుడు. అలాగే సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.
ఇండియాలో ఈ కారు కలిగిన మొదటి మహిళా సెలెబ్రెటీగా నయనతార రికార్డు సృష్టించింది. ఇక దక్షిణాది చిత్రసీమలో రామ్ చరణ్ కి మాత్రమే ఈ కారు ఉంది. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి టాప్ బిజినెస్ మేన్ లు మాత్రమే కొనే ఈ కారుని ఇండియాలో ఇప్పటివరకు సినిమా తారల్లో నయనతార, రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీ మాత్రమే కొన్నారు.
ఇక నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన “మన శంకర వర ప్రసాద్ గారు”, బాలకృష్ణ సరసన ఆయన కొత్త చిత్రంలో (#NBK11) నటిస్తోంది.