శోభితకి భర్త ఇంకా లవర్!

TeluguCinema 23 Nov 2025
Naga Chaitanya and Sobhita

ఈ రోజు నాగ చైతన్య పుట్టిన రోజు. ఆయన బర్త్ డే సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో విషెస్ తెలిపింది. ఒక ఫోటోని కూడా షేర్ చేసింది.

ఐతే, ఈ ఫోటోకింద ఆమె పెట్టిన క్యాప్సన్ అందరినీ ఆకట్టుకొంది. “Happy Birthday Lover.” అని రాసింది. భర్తని ఆమె ఇంకా లవర్ గానే సంబోధించడం విశేషమే. అందుకే ఈ ఫోటో, ఈ క్యాప్సన్ బాగా వైరల్ అయింది.

వీరి పెళ్లి తర్వాత నాగ చైతన్య మొదటి పుట్టిన రోజు. గతేడాది డిసెంబర్ లో నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల పాటు డేటింగ్ చేసుకున్న అనంతరం పెళ్లి అయింది. 2021లో నాగ చైతన్య తన మొదటి భార్య సమంతకి విడాకులు ఇచ్చాడు. 2022లో శోభితతో డేటింగ్ మొదలుపెట్టాడు.

శోభిత, నాగ చైతన్య ఇంతవరకు కలిసి నటించలేదు. ఇక శోభిత ప్రెగ్నెంట్ ఇటీవల వచ్చిన వార్తలు కూడా నిజం కాదని తేలింది.

సమంత, నాగ చైతన్యకు పిల్లలు లేరు. అందుకే, నాగ చైతన్య శోభితతో వెంటనే ఫ్యామిలీని ప్లాన్ చేసుకుంటున్నాడు అని ఊహాగానాలు సాగాయి. కానీ ఇప్పటివరకు వీరు తల్లితండ్రులు కాబోవడం లేదు.